Avatar-2 Trailer | విజువల్‌ వండర్‌ అవతార్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది..వీడియో.

హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేమ్స్‌ కామెరాన్‌ (James Cameron) సిల్వర్‌ స్క్రీన్‌పై సృష్టించిన ఈ విజువల్‌ వండర్‌ గ్లోబల్ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది.

ఈ ప్రాంఛైజీలో ఇపుడు అవతార్‌ 2 (Avatar: The Way Of Water) రాబోతున్నదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందా..? అంటే ఠక్కున గుర్తొచ్చేది అవతార్‌. హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేమ్స్‌ కామెరాన్‌ (James Cameron) సిల్వర్‌ స్క్రీన్‌పై సృష్టించిన ఈ విజువల్‌ వండర్‌ గ్లోబల్ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది.

ఈ ప్రాంఛైజీలో ఇపుడు అవతార్‌ 2 (Avatar: The Way Of Water) రాబోతున్నదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్‌ 2 ట్రైలర్‌ను (Avatar-2 Trailer) మేకర్స్‌ లాంఛ్‌ చేశారు. ఎపిక్‌ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ లో వస్తున్న ఈ చిత్రంలో కేట్‌ విన్స్‌లెట్‌ కూడా భాగం అవుతుండటం విశేషం.

లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రధాన భారతీయ భాషలన్నింటిలో విడుదల చేస్తున్నారు. డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది. 3డీ వెర్షన్‌లో సాగుతున్న ట్రైలర్‌ అవతార్‌ 2 మరో వండర్‌లా ఉండబోతుందని చెబుతోంది.

2009లో రిలీజైన 'అవతార్'కు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. 13 ఏండ్ల తర్వాత అవతార్‌-2 వస్తుండటంతో అప్పడే రికార్డుల వేట గురించి చర్చ మొదలైంది.