Mutual Funds| సాధారణంగా చాలా మంది డబ్బులు ఎక్కువగా బ్యాంకుల్లో (Banks ) దాచుకుంటూ ఉంటారు.

ఈ ట్రెండ్ చాలా కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేస్తుంటారు. చాలా మంది ఇలానే చేస్తూ ఉండొచ్చు. 

ఇంట్లో ఆడి పిల్ల పుట్టినా, లేదంటే చేతికి ఒకేసారి డబ్బులు వచ్చినా.. చాలా మిం బ్యాంక్ ఎఫ్‌డీ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.

ప్రజల ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఒక సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయులు చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 

నెంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ అండ్ సేవింగ్ ఛాయిస్‌గా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయని సర్వేలో తేలింది. స్క్రిప్‌బాక్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి.

స్క్రిప్ బాక్స్ దేశవ్యాప్తంగా 620 మందిపై ఈ సర్వే చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మ్యూచువల్ ఫండ్స్ అనేది నెంబర్ 1 ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌గా అవతరించాయని స్క్రిప్ బాక్స్ పేర్కొంది. 

సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు కాకుండా అదనపు డబ్బులను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని వివరించింది. ఇలాంటి ఫలితాలు రావడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

సేవింగ్స్ కన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా అధిక ప్రయోజనం పొందొచ్చని సర్వేలో పాల్గొన్న చాలా మంది అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సర్వే ప్రకారం చూస్తే.. ఆర్థిక నియంత్రణ అంశంపై చాలా మందిలో ఏకాభిప్రాయం ఉంది.

 ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తుపై భరోసా కలుగుతుందని చాలా మంది భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇన్వెస్ట్‌మెంట్లు ప్రారంభించాలని సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది సూచిస్తున్నారు.

'పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం అనేవి రెండూ వేర్వేరు అంశాలు. చాలా మంది తరచుగా వీటిని ఒకే విధంగా ఉపయోగిస్తూ ఉంటారు. పొదుపు అనేది ఇన్వెస్ట్‌మెంట్‌కు ఒక ముఖ్యమైన తొలి అడుగు. ఇన్వెస్ట్ చేయడం ద్వారా సంపద సృష్టించొచ్చ. 

సరళంగా చెప్పాలంటే దీర్ఘకాల లక్ష్యాలను చేరుకోవడానికి పొదుపు సహాయపడొచ్చు. కానీ ఇన్వెస్ట్ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడి పొందడంతోపాటు లక్ష్యాలను కూడా చేరుకోవచ్చు' అని స్క్రిప్‌బాక్స్ ఫౌండర్, సీఈవో అతుల్ సింఘాల్ తెలిపారు.

సర్వేలో పాల్గన్న వారిలో 50 శాతం మంది వారి ఆదాయంలో 10 నుంచి 30 శాతం మొత్తాన్ని పొదుపు చేస్తున్నారు. 

27 శాతం మంది గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి ఖర్చులు తగ్గించుకున్నారు. 30 శాతం మంది ఎమర్జెన్సీ ఫండ్‌ను కలిగి ఉన్నారు. చాలా మంది వారి పిల్లల చదువు లక్ష్యంగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు