Personality Development | విజయం అనేది నీ తెలివితేటల ఫలితం కాదు. నువ్వు తీసుకునే రిస్క్‌కు ప్రతిఫలం. రిస్క్‌ పెరిగే కొద్దీ విజయాల స్థాయి పెరుగుతుంది.

నిరాశావాది మాత్రం ఆ రిస్క్‌లో ఓటమిని చూస్తాడు. అదేదో డిటర్జెంట్‌ ప్రకటనలో 'మరక మంచిదే' అన్నట్టు, రిస్క్‌ కూడా మంచిదే! షరా: నిబంధనలు వర్తిస్తాయి.

Personality Development | విజయం అనేది నీ తెలివితేటల ఫలితం కాదు. నువ్వు తీసుకునే రిస్క్‌కు ప్రతిఫలం. రిస్క్‌ పెరిగే కొద్దీ విజయాల స్థాయి పెరుగుతుంది. 

నిరాశావాది మాత్రం ఆ రిస్క్‌లో ఓటమిని చూస్తాడు. అదేదో డిటర్జెంట్‌ ప్రకటనలో 'మరక మంచిదే' అన్నట్టు, రిస్క్‌ కూడా మంచిదే! షరా: నిబంధనలు వర్తిస్తాయి.

అధికారంలో ఉన్న పార్టీని కాదని బయటికొచ్చి.. ఒంటరిగా ఉద్యమాన్ని నిర్మించడం అసాధ్యమని కేసీఆర్‌ భావించి ఉంటే.. తెలంగాణ రాష్ట్రం అవతరించేదే కాదు. 

ప్రతి గెలుపు గేయం వెనుకా ఓ గాయం ఉండి తీరుతుంది. కాబట్టే, వేవేల రాళ్లలో శిల్పి ఉలి దెబ్బలకు తట్టుకున్న శిల మాత్రమే.. మూలవిరాట్టుగా ఆలయంలో పూజలు అందుకుంటుంది.

'సాహసము శాయరా డింభకా! రాజకుమారి నీకు దక్కును' అంటాడు ఎస్వీ రంగారావు పాతాళభైరవిలో. కెరీర్‌ కోణంలోంచి చూస్తే.. ఆ సాహసం పేరు రిస్క్‌. రాకుమారి విజయానికి ప్రతీక. 

ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి, ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి… లేదంటే, ఉద్యోగం నుంచి వ్యాపారానికి .. కొత్త అడుగు వేయాలనుకున్న ప్రతిసారీ కోటి గొంతుకలు 'రిస్క్‌.. రిస్క్‌.. రిస్క్‌’ అంటూ గోలపెడుతుంటాయి. అందులో అంతరాత్మ స్వరమూ ఉంటుంది. నిజానికి ఇది భయం కాదు. అచ్చమైన అపోహ. ఒక్కసారి చరిత్ర పుస్తకాలు తిరగేయండి. సైన్స్‌ ఆవిష్కరణలు గుర్తు చేసుకోండి.

 విశ్వ విజేతల ఆత్మకథలు చదువండి. ప్రతి మలుపు వెనుకా రిస్క్‌ ఉంటుంది. ఆదిమ మానవుడు చేతులు కాలుతాయేమో అని భయపడి కూర్చుని ఉంటే.. నిప్పు పుట్టేది కాదు. నాగరికత పెరిగేదీ కాదు.

ఎన్నో రకాలు..

కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ ఉన్నట్టు.. రిస్క్‌లోనూ మూడు రకాలు. మొదటిది సిస్టమెటిక్‌ రిస్క్‌. ఇక్కడ రిస్క్‌ తీసుకున్నా.. దానికంటూ ఓ లెక్క ఉంటుంది. అనుకోని అవాంతరాలు ఏర్పడినప్పుడు.. మనల్ని మనం రక్షించుకోవడానికి ప్లాన్‌-బి సిద్ధంగా ఉంటుంది. 

రెండు డేంజరస్‌ రిస్క్‌. తేడా వస్తే కుప్పకూలిపోవాల్సిందే. మూడోది మధ్యే మార్గం.. కాలిక్యులేటెడ్‌ రిస్క్‌. ఈ పద్ధతిలో అనుకున్న ఫలితాలు వస్తే.. ఎంతోకొంత లాభపడతాం. అనూహ్య ఫలితాలు వచ్చినా తీవ్రంగా నష్టపోం. ఆకాశంలోకి రాయి విసరడం డేంజరస్‌ రిస్క్‌. 

దానివల్ల ఉపయోగం ఉండదు. పైపెచ్చు పైకి ఎగిరిన రాయి మన తలకు తాకే అవకాశమే ఎక్కువ. అర్జునుడిలా లక్ష్యానికి బాణం గురిపెట్టడం సిస్టమెటిక్‌ రిస్క్‌. ఇక్కడ గురితప్పే అవకాశం తక్కువ.

పక్కా వ్యూహంతో

వయసు, బాధ్యతలు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి.. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకునే తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇరవైలలో ఎంత రిస్క్‌ తీసుకున్నా ఇబ్బంది లేదు. చేతినిండా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి, ఆ గాయం నుంచి కోలుకొని మళ్లీ యుద్ధానికి సిద్ధం కావచ్చు.

 మనపైన ఆధారపడి బతికే మనుషులూ ఉండరు కాబట్టి, ఆ ప్రభావం మన ఒక్కరికే పరిమితం. కానీ వయసు పెరిగేకొద్దీ.. రిస్క్‌ను భరించే శక్తి తగ్గిపోతుంది. ఆ సమయంలో కాలిక్యులేటెడ్‌ రిస్క్‌ అయితేనే ఉత్తమం. బైక్‌ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్‌ ధరించినట్టు, రిస్క్‌ తీసుకునే ప్రతిసారీ ఆ ప్రభావం నామమాత్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగాన్ని వదిలి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే.. ఓ ఏడాదికాలానికి సరిపడా మొత్తంతో అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చి వ్యాపారం మూతపడినప్పుడు.. కొత్త జీవితాన్ని ప్రారంభించేవరకూ ఆ డబ్బు ఉపయోగపడుతుంది. లక్ష్యం పట్ల స్పష్టత వచ్చిన తర్వాతే రంగంలోకి దిగాలి. అరకొర సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడం సరికాదు.

ఆత్మవిశ్వాసమే ఆయుధం

రిస్క్‌ తీసుకోవడం అంటే.. కంఫర్ట్‌జోన్‌ను వదిలిపెట్టడం mo. మనదైన సురక్షిత ప్రపంచంలోంచి బయటికి రావడం. కొత్తలో గందరగోళంగా ఉంటుంది. ఓడిపోతామేమో అనే అనుమానం వేధిస్తూ ఉంటుంది. 

చిన్నపాటి కుదుపు రాగానే ఓటమిని అంగీకరిస్తాం. ఇది కాదు, రిస్క్‌ తీసుకోవాల్సిన పద్ధతి. రిస్క్‌ అంటేనే సవాళ్లతో సహవాసం, ఓటములతో భేటీ. అనుకున్న ఫలితం వచ్చేదాకా పోరాడుతూనే ఉండాలి.

 లక్ష్యాన్ని వెంటాడుతూనే ఉండాలి. ప్రతి రిస్క్‌ నిన్ను గెలిపించకపోవచ్చు. కానీ ప్రతి రిస్క్‌తో నీ మనోబలం పెరుగుతుంది. అదే విజయానికి తొలిమెట్టు.